మృతదేహాలను పరిశీలించిన NHRC బృందం

మృతదేహాలను పరిశీలించిన NHRC బృందం

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితులకు జరిపిన పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ సభ్యులు.. ఆ తర్వాత  పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ లను క్రాస్ ఎగ్జామ్ చేశారు. నలుగురు డెడ్ బాడీల్లో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయనే దానిపై ఆరా తీశారు. గాయాలు తగిలిన తీరును అడిగి తెలుసుకున్నారు. నిన్న గాంధీ ఆసుపత్రి వైద్యులు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించడంతో అన్ని రిపోర్ట్ లను పరిశీలించారు. నిందితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు చటాన్ పల్లికి బయల్దేరారు. ఎన్ కౌంటర్ ఎలా జరిగింది?  అందుకు ప్రధాన కారణాలేంటి? నిందితులు ఎందుకు దాడికి దిగారు?  అనే అంశాలపై షాద్ నగర్ ఏసీపీ అడిగి తెలుసుకునే అవకాశం ఉందని సమాచారం.