మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం

మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం

ఎమ్మెల్యే జగ్గారెడ్డిది తమ కుటుంబ సమస్య అని.. తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగ్గారెడ్డికి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తమంతా కలిసి పనిచేస్తామన్నారు. తమ పార్టీ పెద్దలు  జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారన్నారు జగ్గారెడ్డి విషయంలో పార్టీ.. పూర్తిగా అండగా ఉంటుందన్నారు.పీసీసీ చీఫ్ గా అన్ని విషయాలు బయటకు చెప్పలేనన్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ లు వచ్చాయని కుంగిపోవద్దన్నారు. గతంలో వీహెచ్ పై, తనకు ఇలాంటి ఘటనలు ఎదురయ్యాయన్నారు రేవంత్.

మరిన్ని వార్తల కోసం

భారత్ను అమెరికా కన్నా గొప్పగా తీర్చిదిద్దుకోవాలి

ప్రపంచ చెస్ టోర్నీలో భారత టీనేజర్ సంచలనం