
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’. ఈ సినిమా కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు ‘రాజా సాబ్’ టీజర్తో వారి ఆకలి తీర్చనున్నారు మేకర్స్. కానీ, ప్రభాస్ ఫ్యాన్స్.. రేపు రాబోయే టీజర్ కోసం వెయిట్ చేయలేకపోతుండటంతో.. కొంచెమైనా శాంతిపజేయాలని.. ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. నేడు జూన్ 15న ప్రీ టీజర్ రిలీజ్ చేశారు.
'గాలిలో చల్లదనం...దారిలో ఒక ఉల్లాసం... రేపు ఉదయం 10:52 గంటలకు రెబెల్ వైబ్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి' అని టీజర్కు క్యాప్షన్ ఇచ్చారు. టీజర్ ఎంటర్‌టైనింగ్‍గా, భయానకంగా సాగుతుందని ప్రీ టీజర్ చూస్తే తెలుస్తోంది. గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని అర్ధమవుతుంది. ఇది రేపు రానున్న ఫుల్ టీజర్ పై క్యూరియాసిటీ అమాంతం పెంచిసేంది.
►ALSO READ | OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే !
ప్రీ టీజర్
మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ కోసం.. వేచి ఉండటం దాదాపుగా ముగిసింది. రేపు రానున్న టీజర్ పై ఆసక్తిని రేకెత్తించడానికి మేకర్స్ ప్రీ-టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ లో హీరోయిన్స్.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ మరియు రిద్ధి కుమార్ పైకి చూస్తున్నట్లు కనిపిస్తారు. ఆ భవనంలో వారు ఏదో అసాధారణమైన విషయం చూసి ఆశ్చర్యపోయినట్లు అనిపిస్తుంది. అయితే, వారు ప్రభాస్‌ను చూస్తున్నారని తెలుస్తోంది. అతను వారి పైన తలక్రిందులుగా కూర్చున్నట్లు కనిపిస్తున్నట్లు అర్ధమవుతుంది.
ఇకపోతే.. రాజాసాబ్ టీజర్ 2 నిమిషాల 2 సెకన్లు (122 సెకన్లు) ఉంటుందని సమాచారం. అయితే, ఇటీవలే రాజా సాబ్ టీజర్ ఆన్‌లైన్‌లో లీకైన విజువల్స్ అయ్యాయి. నిర్మాతలు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు.
All smiles now… 😍
— People Media Factory (@peoplemediafcy) June 13, 2025
but what’s coming will send shivers down your spine 🔥
Here’s a working still from #TheRajaSaab sets ❤️#TheRajaSaabTeaser on June 16th at 10:52AM 💥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @vishwaprasadtg… pic.twitter.com/mnPLztTUjI
ప్రభాస్ తన మాస్ ఇమేజ్ను పక్కనబెట్టి.. తన కెరియర్లో ఫస్ట్ టైం హార్రర్ కామెడీ చేస్తున్నారు. ప్రభాస్ కామెడీ రోల్ను చూడటానికి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ మరియు యోగి బాబు ప్రముఖ పాత్రల్లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా లో
RAJA with a REBEL VIBE 😎#TheRajaSaab is set cover off a CURTAIN RAISER SHOW of a MOST ENTERTAINING Euphoria in the theatres 💥
— People Media Factory (@peoplemediafcy) June 3, 2025
WORLDWIDE in cinemas from DEC 5th 🔥
But before that TEASER EXPLOSION on JUNE 16 at 10:52 AM ❤️🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi… pic.twitter.com/4oVLchbMnC