అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ.. అనే పాట కొన్ని ఇన్సిడెంట్స్‌కు సరిగ్గా సెట్టవుతుందంటే ఇదే. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో దోపిడీ చేయాలని ప్లాన్ చేశాడు. తలుపులు, కిటికీలు పగలగొడితే పెద్ద శబ్దం వస్తుంది.. ఎందుకొచ్చిన తంటా.. కిచెన్ ఫ్యాన్ కోసం ఉంచిన రంద్రం గుండా లోనికి ఎంటరై మళ్లీ అంతే ఈజీగా బయటకు వస్తే సరిపోతుందని ప్లాన్ చేశాడు. కానీ.. అదే రంద్రంలో ఇరుక్కుని గంట పాటు నరకం చూశాడు ఈ దొంగ. నడుము పైభాగం ఒకవైపు.. కింది భాగం మరోవైపు స్టక్కవడంతో ఆ దొంగ హాహాకారాలు అంతా ఇంతా కాదు.
ఈ ఇన్సిడెంట్ రాజస్థాన్ లోని కోటాలో జరిగింది. కోటాలో నివాసం ఉంటున్న సుభాష్ కుమార్ రావత్ అనే వ్యక్తి..ఖతుశ్యాంజీకి వెళ్లిన టైమ్ లో దొంగ ప్లాన్ చేసి ఇరుక్కుపోయాడు. జనవరి 3న జరిగింది ఈ ఘటన. అయితే టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మెయిన్ గేట్ కు లాక్ వేసింది సుభాష్ భార్య. ఇంటి బయట పార్కింగ్ చేసిన స్కూటర్ హెడ్ లైట్స్ ఆన్ లో ఉండటం.. కిచెన్ లైట్లు ఆన్ చేసి ఉండటం
ALSO READ : ఆన్‌లైన్లో పెట్టుబడి పెట్టేముందు ఇది చూడండి..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇంట్లోకి కిచెన్ ఎక్సాస్ట్ ఫ్యాన్ రంద్రం గుండా ప్రవేశించి దోపిడీ చేయాలని ప్రయత్నించాడు. రంద్రంలో దూరినప్పుడు నడుము భాగంగా వరకు దూరిన తర్వాత ఇరుక్కుపోయాడు. దీంతో నడుము పైభాగం ఒకవైపు, కింది భాగం మరోవైపు ఉండిపోయింది. బయటకు లేదా లోనికి వెళ్లేందుకు వీలు లేకుండా స్టక్కైపోయాడదు.
హోల్ లో ఇరుక్కుపోయిన దొంగ.. బయటకు రాలేక లోనికి వెళ్లలేక.. తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేశాడు. దీంతో భయంతో మరో దొంగ బైక్ తీసుకుని పారిపోయాడు. కిచెన్ హోల్ లో ఇరుక్కున్న దొంగ మాత్రం తప్పించుకోలేక గంట పాటు ఇరుక్కుపోయి.. పెడబొబ్బలు పెట్టాడు. కనీసం గంట సేపు నరకం అనుభవించాడు.
ALSO READ : హైదరాబాద్లో విషాద ఘటన..
స్థానికులు అందించిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దొంగతనానికి కారులో వచ్చిన నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కార్ కు పోలీస్ స్టిక్కర్ వేసుకుని వచ్చారు. కిచెన్ హోల్ లో ఇరుక్కుపోడంతో ఎట్టకేలకు పోలీసులకు పట్టబడ్డారు.
In Rajasthan's Kota, a family returned from Khatu Shyam Ji darshan to find a thief stuck in the exhaust fan hole! They called police to pull him out. Accused Pawan drives a police officer's car. 😳
— Ghar Ke Kalesh (@gharkekalesh) January 6, 2026
pic.twitter.com/mwNcxjD2AF
