హైదరాబాద్: ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి నిండు ప్రాణం పోయింది. టోలిచౌకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డెలివరీ బాయ్గా పనిచేసే యువకుడు మృతి చెందాడు. జెప్టో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న యువకుడు కస్టమర్కు డెలివరీ చేసేందుకు వెళ్తూ.. బైక్ స్కిడ్ అయి కింద పడిపోయాడు.
గమనించకుండా.. అభిషేక్ తల మీదకు ప్రైవేట్ బస్ డ్రైవర్ బస్ ఎక్కించాడు. స్పాట్లోనే అభిషేక్ చనిపోయాడు. ఆపకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన ప్రైవేట్ బస్ డ్రైవర్ను స్థానికులు అడ్డగించి బస్ ఆపారు. రోడ్డుపై మృతదేహం పడి ఉన్నా.. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు పట్టించుకోకుండా వెళ్ళిన తీరు మానవత్వం ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది.
ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కిరాణా సామాన్ల డెలివరీ స్టార్టప్ల మధ్య పోటీ ఉద్యోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. మన దేశంలో డెలివరీ స్టార్టప్లు క్విక్ కామర్స్పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. సిటీల్లో కేవలం పది నిమిషాల్లో డెలివరీ ఇస్తున్నాయి. ఇలా స్పీడ్గా డెలివరీ చేసే వ్యాపారాన్ని క్విక్ కామర్స్గా పిలుస్తున్నారు. నిమిషాల్లో కస్టమర్ఇంటికి చేరుకోవడానికి డెలివరీ ఏజెంట్ ఉరుకులుపరుగులు పెడుతున్నాడు. కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ను పాటించడం లేదనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఫలితంగా యాక్సిడెంట్లు జరిగి ఆస్పత్రులు పాలవుతున్నారు. ఇలా కొందరు డెలివరీ బాయ్స్ ప్రాణాలే పోతున్నాయి.
Also Read : చిట్టీ డబ్బులు అడిగినందుకు తండ్రీ కొడుకులు కలిసి చితకబాదారు
డెలివరీ స్టార్టప్లు సిటీలో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని డార్క్ స్టోర్లు లేదా చిన్న గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే ఏజెంట్ అక్కడి నుంచి నిమిషాల్లో కస్టమర్ ఇంటికి చేరుకుంటాడు. ఆహార పదార్థాలను నిమిషాల్లోనే తెచ్చివ్వడంతో కస్టమర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి.
నచ్చిన వస్తువులు తక్షణమే ఇంటికి రావడం కస్టమర్లకు ఎంతో నచ్చిందని, దీనివల్ల సిటీ జనం జీవన విధానమే మారిపోయింది. యూరప్, అమెరికా వంటి దేశాల్లోనూ డెలివరీ స్టార్టప్లు క్విక్ డెలివరీలు ఇస్తున్నాయి కానీ అక్కడి రోడ్లు విశాలంగా ఉండటం, ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించడం వల్ల పెద్దగా ఇబ్బందులు రావడం లేదు. ఇండియాలో రోడ్లు బాగుండవు కాబట్టి క్విక్ కామర్స్ ప్రమాదకరమైన బిజినెస్ అని ఎనలిస్టులు చెబుతున్నారు.
