ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ మళ్లీ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తన గాళ్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌ను పెండ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. శనివారం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ మ్యారేజ్ ప్రైవేట్ వేడుకగా జరిగింది. టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, రోహిత్ శర్మ దంపతులు ఈ వేడుకకు హాజరయ్యారు.
చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ ధవన్–సోఫీ పెండ్లి ఫొటోను షేర్ చేశాడు. గతంలో అయేషా ముఖర్జీని పెళ్లాడిన శిఖర్ కొన్నేండ్ల తర్వాత విడిపోయాడు. వీళ్లకు కుమారుడు జోరావర్ ఉన్నాడు. ఏడాది కాలంగా సోఫీతో ప్రేమలో ఉన్న ధవన్ జనవరిలో ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
