హైదరాబాద్, వెలుగు: టీ-గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఓపెన్ అమెచ్యూర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో అమూల్య విన్నర్‌గా నిలిచింది. గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్‌లో శనివారం ముగిసిన 18 హోల్ చాంపియన్‌షిప్ కోర్సులో అమూల్య 148 స్కోరుతో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. గ్రాస్ విన్నర్ గా ట్రోఫీ, రూ. 90 వేల ప్రైజ్‌మనీ అందుకుంది.
శ్వేత గుళ్లపల్లి (151) ఫస్ట్ రన్నరప్‌గా, అభిషేక్ మిత్రా (152) సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. టోర్నీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారికి ట్రోఫీలు అందజేశారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ గోల్ఫ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడంలో టీ- గోల్ఫ్ ఫౌండేషన్ కృషిని అభినందించారు. ఈ టోర్నీ గోల్ఫ్ టూరిజాన్ని ప్రోత్సహించడమే కాకుండా, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యానికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
