రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటు చేయాలి..డిప్యూటీ క‌లెక్టర్స్ డిమాండ్

రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటు చేయాలి..డిప్యూటీ క‌లెక్టర్స్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: భూ ప‌రిపాల‌న‌లోని మార్పులు, భ‌విష్యత్  అవ‌స‌రాల‌కు త‌గ్గట్టు రెవెన్యూ అధికారుల‌కు శిక్షణ  ఇచ్చేందుకు రాష్ట్రంలో రెవెన్యూ అకాడ‌మీ ఏర్పాటు చేయాల‌ని డిప్యూటీ క‌లెక్టర్స్  అసోసియేష‌న్‌ (తెలంగాణ స్టేట్  సివిల్  స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌) డిమాండ్  చేసింది. శనివారం హైద‌రాబాద్‌లో అసోసియేష‌న్  రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశం జ‌రిగింది.

గ‌త రెండేళ్లుగా రెవెన్యూ శాఖ‌లో వ‌చ్చిన మార్పులు, ప్రస్తుతం రెవెన్యూ ఉద్యోగుల స‌మ‌స్యలు, భ‌విష్యత్‌లో ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై చ‌ర్చించారు. త‌హ‌సీల్దార్   నుంచి అడిష‌న‌ల్  క‌లెక్టర్  వ‌ర‌కు అన్ని స్థాయిల్లో ప‌దోన్నతులు క‌ల్పించాలని కోరారు.