జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. చిట్టీ డబ్బులు ఒక వ్యక్తి ప్రాణం తీశాయి. చిట్టీ డబ్బులు కట్టడం లేదని నిలదీసినందుకు తండ్రీ కొడుకులు కలిసి ఒక వ్యక్తిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలో చిట్టీ డబ్బుల వ్యవహారంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. చిట్టి డబ్బులు 12వేల రూపాయలు అడిగినందుకు అంజయ్య అనే వ్యక్తిని చితికబాదారు తండ్రి, కొడుకులు దాసోజు శ్రీను, దాసోజు వేణు. తండ్రి కొడుకుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంజయ్య(53) మృతి చెందాడు.
జగిత్యాల గణేష్ నగర్ కు చెందిన దాసోజు శ్రీనివాస్ కు, అంజయ్యకు మధ్య లక్ష రూపాయల చిట్టీ విషయం లో గొడవ జరిగింది. చీటి డబ్బులు అడిగినందుకు కొలగాని అంజయ్యపై దాడి చేశారు. అంజయ్య మృతి చెందటంతో అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
