రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్

రామగుండం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు : ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
  •     ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్​ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి క్యాంప్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో తమ పాలనపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని అసత్య ఆరోపణలు, విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ వైపే ఉన్నారన్నారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్​ కార్పొరేటర్లను గెలిపించిన వారందరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 

కాంగ్రెస్‌‌‌‌లోకి నలుగురు ఏఐఎఫ్‌‌‌‌బీ కార్పొరేటర్లు...

ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆల్​ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్(ఏఐఎఫ్‌‌‌‌బీ) నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. అడ్లూరి రవి(3వ డివిజన్), కర్రావుల దాడిరాజు(44వ) , చిదురాల నాగరాజు(52వ), బాలసాని తిరుపతిగౌడ్(59వ) ​ శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ కండువాలు కప్పి కాంగ్రెస్​ పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ నలుగురితో పాటు బీఆర్​ఎస్​ కార్పొరేటర్​ అడ్డాల గట్టయ్య చేరికతో రామగుండం కార్పొరేషన్​లో కాంగ్రెస్​ బలం 43కు చేరింది. సింహం గుర్తుపై ఆరుగురు గెలవగా అందులో నలుగురి చేరికతో ఆ పార్టీలో ఇద్దరే మిగిలారు.