జెండా మోసిన పార్టీ కార్యకర్తనే చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జెండా మోసిన పార్టీ కార్యకర్తనే చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
  •     కాంగ్రెస్‌‌‌‌ను వీడేది లేదు 
  •     మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: పార్టీ జెండా మోసిన కార్యకర్తలనే చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ చేయాలని, అవకాశవాదులకు ఆ అవకాశం ఇవ్వాలని, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌‌‌‌ను కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సంజయ్ నుంచి స్వేచ్ఛను కల్పించాలని పార్టీ పెద్దలను కోరారు. కురు సామ్రాజ్య పతనానికి శకుని పోషించిన పాత్రలా జగిత్యాలలో కాంగ్రెస్ పతనానికి ఎమ్మెల్యే కారణమయ్యారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బలపరిచిన రాయికల్ మున్సిపాలిటీలో 8 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటి గెలిచారని, తాము మూడు స్థానాల్లో పోటీ చేస్తే రెండు గెలుచుకున్నామన్నారు. 

ఎమ్మెల్యే సూచనలు, సలహాలతో బీ ఫామ్ పంపిణీలో నేడు స్వతంత్రులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొందని, అయినా జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తలను ఓడించడానికి ఎమ్మెల్యే  ప్రచారం చేశారని ఆరోపించారు. గెలిచిన అభ్యర్థులను ప్రలోభ పెట్టేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వతంత్రులకు తాను అండగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన లేదని స్పష్టం చేశారు.