ఆన్‌లైన్లో పెట్టుబడి పెట్టేముందు ఇది చూడండి.. హైదరాబాద్‌లో రూ.50 లక్షలు ఎంత ఈజీగా మోసం చేశారంటే..

ఆన్‌లైన్లో పెట్టుబడి పెట్టేముందు ఇది చూడండి.. హైదరాబాద్‌లో రూ.50 లక్షలు ఎంత ఈజీగా మోసం చేశారంటే..

హైదరాబాద్ వంటి సిటీల్లో నివసించే సగటు జీవికి.. పెరుగుతున్న ఖర్చులతో ఎంత సంపాదిస్తున్నా.. నెలాఖరికి అకౌంట్లో జీరో నుంచి మైనస్ బ్యాలన్స్ ఉండటం చూస్తూనే ఉన్నాం. చాలీ చాలని జీతాలతో.. మధ్యతరగతి కష్టాల నుంచి తప్పుకునేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటారు కొందరు. ఇలాంటి మిలియన్ డ్రీమ్స్ ఉన్న మిడిల్ క్లాస్ ను ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ట్రాప్ చేసి లక్షల్లో, కోట్లల్లో కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లో ఆన్ లైన్ పెట్టుబడుల పేరున రూ.49 లక్షల 90 వేలను కొల్లగొట్టిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేశారు పోలీసులు. 

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరున మోసానికి పాల్పడిన నిందితుడిని హైదరాబాద్ లో మంగళవారం (జనవరి 06) అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అష్ఫాక్ అనే వ్యక్తి ఖాతాలను సైబర్ మోసగాళ్లకు కమిషన్‌పై ఇచ్చి, ట్రేడింగ్ మోసాల్లో భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ALSO READ : హైదరాబాద్లో విషాద ఘటన..

వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా పెట్టుబడుల పేరుతో 49 లక్షల 90 వేల రూపాయల వరకు మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఖాతా ద్వారా 3 కోట్ల 70 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.  దేశవ్యాప్తంగా 29 కేసుల్లో నిందితుడి పాత్ర ఉందన్నట్లు అనుమానిస్తున్నారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.