గ్లోబల్​ ఇన్వెస్టర్లకు భరోసా.. అదానీ ఎపిసోడ్​తో పీఎస్​బీలకు ఇబ్బంది లేేేదు : నిర్మల

గ్లోబల్​ ఇన్వెస్టర్లకు భరోసా.. అదానీ ఎపిసోడ్​తో పీఎస్​బీలకు ఇబ్బంది లేేేదు : నిర్మల

వెలుగు బిజినెస్​ డెస్క్​ : బ్యాంకింగ్​ సిస్టమ్​ పటిష్టంగా ఉందని అటు ఢిల్లీలో  ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​, ఫైనాన్స్​ సెక్రటరీ టీ వీ సోమనాథన్ చెప్పగా​, ఇటు ముంబైలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) స్టేట్​మెంట్​ రిలీజ్​చేసింది.  అదానీ గ్రూప్​కు  ఇచ్చిన  అప్పులు పరిమితులకు లోపే ఉన్నాయని బ్యాంకులు, ఎల్​ఐసీ వివరణ ఇచ్చినట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ పేర్కొన్నారు. ఇండియన్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​ పటిష్టంగా ఉందని గ్లోబల్​ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు భారీగా పడినా, పబ్లిక్​ ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్ల పెట్టుబడులు ఇంకా లాభాల్లోనే ఉన్నట్లు వెల్లడించారు. అదానీ గ్రూప్​షేర్లు భారీగా పడుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్​ కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన అప్పుల విషయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఈ రెండు స్టేట్​మెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  యూఎస్​ షార్ట్​ సెల్లర్​ హిండన్​బర్గ్​ రిపోర్టు వచ్చాక గడచిన వారం రోజుల్లో అదానీ గ్రూప్​ లిస్టెడ్​ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. మాక్రో ఎకనమిక్​  కోణంలో చూస్తే అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం టీ కప్పులో తుపాను లాంటిదని ఫైనాన్స్​ సెక్రటరీ పేర్కొన్నారు. స్టాక్​ మార్కెట్లలో షేర్ల హెచ్చు–తగ్గులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఏవైనా పొరపాట్లు జరిగితే యాక్షన్​ తీసుకోవడానికి ఇండిపెండెంట్​ రెగ్యులేటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని బ్యాంకులలో డబ్బు దాచుకున్న డిపాజిటర్లు, ఇన్సూరెన్స్​ పాలసీ హోల్డర్లు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమనాథన్​ చెప్పారు. 

అదానీ రికార్డులపై ఎంసీఏ రివ్యూ

అదానీ గ్రూప్​ ఫైనాన్షియల్​ స్టేట్​మెంట్లపై మినిస్ట్రీ ఆఫ్​ కార్పోరేట్​ ఎఫైర్స్​ (ఎంసీఏ) రివ్యూ మొదలైనట్లు  ఇద్దరు సీనియర్​ ఆఫీసర్లు వెల్లడించారు. ఈ గ్రూప్​పై ఇలాంటి రివ్యూ జరగడం 
ఇదే మొదటిసారి. 
గ్లోబల్​ రేటింగ్​ ఏజన్సీల కామెంట్​....
గ్లోబల్​ రేటింగ్​ ఏజన్సీలు మూడీస్​, ఫిచ్​ అదానీ గ్రూప్​ ఎపిసోడ్​పై కామెంట్​ చేశాయి. తాజాగా క్యాపిటల్​ సమీకరించాలంటే అదానీ గ్రూప్​కు కష్టమవుతుందని మూడీస్​ చెబితే, ఇప్పటికిప్పుడు రేటింగ్​లో మార్పు చేయాల్సిన అవసరమేమీ లేదని ఫిచ్​ ప్రకటించింది.

హిండన్​బర్గ్​పై దర్యాప్తు కోరుతూ సుప్రీం కోర్టులో పిల్​.....

క్రవారం ఇంకో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. సీరియల్​గా పిటిషన్లు ఫైల్​ చేసే అడ్వకేట్​ ఎం ఎల్​ శర్మ యూఎస్​ షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​పై దర్యాప్తు కోరుతూ ఒక పబ్లిక్​ ఇంటరెస్ట్​ లిటిగేషన్​ (పిల్​)ను సుప్రీం కోర్టులో ఫైల్​ చేశారు. తన రిపోర్టు ద్వారా అదానీ గ్రూప్​ కంపెనీల షేర్లు పతనమయ్యేలా చేయడంతోపాటు, ఆ షేర్లలో పెట్టుబడులు పెట్టిన స్మాల్​ ఇన్వెస్టర్లు నష్టపోయేలా చేసినందుకు హిండన్​బర్గ్​ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలివ్వమని కోర్టును ఆయన కోరారు. ఆ రిపోర్టు వల్ల అదానీ గ్రూప్​లోని లిస్టెడ్​ కంపెనీలు రూ. 10 లక్షల కోట్ల మేర మార్కెట్​ విలువను పోగొట్టుకున్నాయని శర్మ ప్రస్తావించారు.