సల్మాన్ ఖాన్ ను కాటేసిన పాము

సల్మాన్ ఖాన్ ను కాటేసిన పాము

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను పాము కాటేసింది. దీంతో వెంటనే అతడు ఆస్పత్రిలో చేరాడు. వివరాల్లోకి వెళ్తే..  ఇవాళ ఉదయం మహారాష్ట్ర లోని పన్వేల్‌ లోని ఫామ్‌ హౌస్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ను పాము కరిచింది. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఎలాంటి విషం లేని పాము కాటేయడంతో సల్మాన్ కు ప్రాణ హాని లేదని డాక్టర్లు తెలిపారు. పాము కాటు వేసిన తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.  ఆస్పత్రిలో సల్మాన్ ఖాన్ కు అవసరమైన వైద్యం అందించాక.. కొంత సమయం అబ్జర్వేషన్ లో ఉంచారు డాక్టర్లు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ చేతిపై పాము కాటేసినట్లు సమాచారం. 

రేపు సల్మాన్ బర్త్ డే. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఫాంహౌస్ కు వెళ్లినట్లు సమాచారం. అయితే అతని ఆరోగ్యం ఎలా ఉన్న సరే.. ఇవాళ రాత్రికి పార్టీ ఇచ్చేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ సమయంలో కూడా సల్మాన్ చాలా టైం పన్వేల్ ఫాం హౌస్ లోనే గడిపారు. ఫాం హౌస్ లో పొలంలో పనిచేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

మరో హిందీ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమంత గ్రీన్‌ సిగ్నల్

రివ్యూ : శ్యామ్ సింగరాయ్