యూఎస్ ఓపెన్లో సెరెనా బోణి

యూఎస్ ఓపెన్లో సెరెనా బోణి

టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్లో శుభారంభం చేసింది. ఉమెన్స్ సింగిల్స్లో ఆమె మోంటెనెగ్రోకు చెందిన డాంకా కోవినిక్‌పై 6--3, 6-3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్కు దూసుకెళ్లింది.దీంతో  యూఎస్ ఓపెన్లో మొదటి రౌండ్లో విజయాల రికార్డును మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు సెరెనా 21- -వరుసగా యూఎస్ ఓపెన్ ఫస్ట్ రౌండ్ లో విజయం సాధించడం విశేషం. 

మ్యాచ్కు ప్రముఖులు హాజరు..
యూఎస్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పనుండటంతో..ఈ మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సెరెనా మ్యాచ్ను  మైక్ టైసన్, గ్లాడిస్ నైట్,  మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు.  గెస్ట్ బాక్స్‌ నుంచి సెరెనా కూతురు మ్యాచ్ను తిలకించింది. మ్యాచ్ తర్వాత సెరెనా ప్రేక్షకుల నుంచి  ప్రశంసలు అందుకుంది. స్టేడియంలో ఉన్నవాళ్లంతా నిలబడి ఆమెను అభినందించారు.

 

మ్యాచ్లో గెలిచేందుకే ప్రయత్నిస్తా..
మైదానంలోకి దిగినప్పుడు తాను ఉత్తమ ప్రదర్శన చేసేందుకే ప్రయత్నిస్తానని సెరెనా విలియమ్స్ తెలిపింది. యూఎస్ ఓపెన్లో ..ఈ కోర్టులో ఆడేందుకు తాను ఇష్టపడతానని వెల్లడించింది. ఎలాంటి మ్యాచ్ అయినా సరే..గెలిచేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. తాను టెన్నిస్ మళ్లీ ఆడతానో లేదో తనకు తెలియదని ..దానిపై తనకు క్లారిటీ లేదని వివరించంది. 

23వేల మంది సమక్షంలో మ్యాచ్..
23-సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచిన సెరెనా మ్యాచ్ ను 23వేల మంది ప్రేక్షకులకు తిలకించారు. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఫ్యాన్స్..  వి లవ్ సెరెనా" అంటూ నినాదాలు చేశారు.  మ్యాచ్‌కు ముందు విలియమ్స్ సాధించిన విజయాలకు గుర్తుగా  స్టేడియంలో  వీడియో మాంటేజ్‌ను  ఏర్పాటు చేసింది.