వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్

కడప జిల్లా, రాయచోటి  పట్టణ శివారు ప్రాంతంలోని ఇనాయత్ ఖాన్ చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రాజు ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా ఉండేందుకు గానూ అక్కడ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఒక వాహనదారుడు రాయచోట వద్ద స్కూటరుపై రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్ నరేంద్ర వెంటనే అప్రమత్తమయ్యాడు. స్థానికుల సాయంతో వాహనదారుడ్ని అలుగులో కొట్టుకుపోకుండా కాపాడాడు. దీంతో నరేంద్రను అందరూ మెచ్చుకుంటున్నారు. జిల్లా ఎస్‌‌పీ కేకేఎన్ అన్బురాజన్ నరేంద్రను ప్రత్యేకంగా అభినందించారు. 

 

Hats off constable Ravindra..

Posted by Sravan Reddy on Wednesday, September 29, 2021

మరిన్ని వార్తల కోసం: 

పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. బూతులు తిడుతూ రెచ్చిపోయిన దుండగులు

నెట్​ లేకుండానే యూపీఐ ట్రాన్సాక్షన్లు

చెబితే వింటది..చెప్పింది చేస్తది