500 కోట్ల ఏండ్లకు మన సూర్యుడూ ఇట్లైతడు

500 కోట్ల ఏండ్లకు మన సూర్యుడూ ఇట్లైతడు

మన సూర్యుడిలో మరో 500 కోట్ల ఏండ్లకు ఫ్యూయెల్ అయిపోతదట. బయటి ప్రాంతమంతా ఎర్రగా మారిపోయి, కేంద్రంలో తెల్లని మరుగుజ్జు నక్షత్రంలా సూర్యుడు మారిపోతాడట. ఆ టైంలో ఇక మన భూమి సూర్యుడి వేడికి బూడిదైపోక తప్పదని సైంటిస్టుల అంచనా. అయితే, మనకు 2 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఓ చిన్న వైట్ డ్వార్ఫ్​నక్షత్రం చుట్టూ నెఫ్ట్యూన్ వంటి భారీ గ్రహం క్షేమంగా తిరుగుతోందని ఇటీవల బ్రిటన్, యూఎస్ సైంటిస్టులు కనుగొన్నారు. దీనిని బట్టి.. మన సూర్యుడు వైట్ డ్వార్ఫ్ గా మారినా మన భూమి సేఫ్​గా ఉంటుందన్న చిన్న ఆశ ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు.