టీ అమ్ముకునే వ్యక్తికి రూ. 50 కోట్ల అప్పు

టీ అమ్ముకునే వ్యక్తికి రూ. 50 కోట్ల అప్పు

టీ అమ్ముకునే వ్యక్తికి ఓ బ్యాంకు రూ. 50 కోట్ల అప్పు ఇచ్చిందట. అదేంటి టీ సెల్లర్ కు రూ. 50 కోట్ల అప్పు ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా? అవును అందరికీ అదే సందేహం. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురుక్షేత్రకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా అతని వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దాంతో ఏదైనా కొత్త వ్యాపారం చేయాలని రాజ్ కుమార్ అనుకున్నాడు. అందుకోసం అతని దగ్గర తగిన డబ్బు లేకపోవడంతో.. లోన్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే బ్యాంక్ సిబ్బంది అతని లోన్ ను తిరస్కరించింది. కారణం ఏంటో తెలుసుకుందామని రాజ్ కుమార్.. ఆధార్ కార్డుతో బ్యాంకును సంప్రదించాడు. అక్కడ రాజ్ కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. ‘ఇప్పటికే నువ్వు రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నావని.. అందుకే నిన్ను ఎగవేతదారుడిగా గుర్తించాం’ అని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.

రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘నేను అసలు రుణం తీసుకోనప్పుడు బ్యాంక్ నన్ను రుణ ఎగవేతదారుడిగా ఎలా గుర్తించిందో నాకు అర్థం కావడం లేదు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే నాకు అంత లోన్ ఎలా ఇస్తారు? నేను ఆ లోన్ తీసుకోనప్పుడు.. నా పేరు మీద ఈ లోన్ ఎవరికి ఇచ్చారు?’ అని ప్రశ్నిస్తున్నాడు.

For More News..

టెర్రిఫిక్ వీడియో: ఫ్లాట్ కి మంటలు.. మూడో ఫ్లోర్ నుంచి దూకిన ఇద్దరు చిన్నారులు

కరెంట్ షాక్ తో తాత మనవరాలు మృతి..

తెలంగాణలో 20 రోజుల్లో 30 వేల కేసులు

చికెన్లో మత్తు కలిపి.. తల్లీ కూతుళ్లపై గ్యాంగ్ రేప్