గణేవ్ ఉత్సవాలపై కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్..

గణేవ్ ఉత్సవాలపై కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్..

హైదరాబాద్, వెలుగు: కరోనా పేరుతో గణేశ్‌ ఉత్సవాలను అడ్డుకున్నా, అక్రమ కేసులు పెట్టినా అధికార పార్టీ లీడర ఇండ్లను ముట్టడిస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కు బీజేపీ దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు. కరోనా పేరుతో గణేశ్‌ ఉత్సవాలను అడ్డుకుంటున్న సీఎం కేసీఆర్ చర్యలను ప్రజలు, హిందూ సమాజం గమనిస్తోందని, తగిన సమయంలో సరైన జవాబిస్తారని సంజయ్ చెప్పారు. హిందూ ధార్మిక సంస్థలు, వినాయక ఉత్సవ సమితులు నిర్దేశించిన ప్రకారం భక్తులు పండుగ ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని, నిర్వాహకులకు బీజేపీ అండంగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఉద్దే శపూర్వకంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణను రాష్ట్ర సర్కార్ తప్పుదారి పట్టిస్తోందని సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

స్టూడెంట్స్ లో సత్తా పెంచుతుంది

దేశానికి పూర్వవైభవం తీసుకురావడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వెన్నుదన్నుగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. ఈ పాలసీతో పని కల్పన తో పాటు ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. మంగళవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేష న్ పాలసీపై ఆన్లైన్లో రాష్ర్టస్థా యి అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సంజయ్ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 74 ఏండ్లతర్వాత పూర్తిస్థాయి ఎడ్యుకేషన్ పాలసీని ప్రధాని మోడీ తీసుకొచ్చారని చెప్పారు. స్టూడెంట్స్ సామర్థ్యాలను పెంచేందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తోడ్పడుతుందని స్పష్టం చేశారు. ఏబీఆర్ ఎస్ఎం జాతీయ అధ్యక్షుడు జేపీ సింఘాల్ మాట్లాడుతూ… నూతన విద్యావి ధానం చారిత్రాత్మకమైనదని, సమగ్రమైనదని అన్నారు.రిటైర్డ్ఐఏఎస్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… సమాజంలోని అట్టడుగువర్గాల వారికీ కూడా విద్యను అందించే లక్ష్యంతో ఈ పాలసీ ఉందన్నారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, ఏబీఆర్ఎస్ ఎం జాతీయ ఉపాధ్యక్షుడు పాలేటివెంకట్ రావు, తపస్ రాష్ర్టఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్, మాజీ అధ్యక్షుడు సూరం విష్ణు వరన్ధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.