స్పైడర్ మ్యాన్ కాదు.. వింత దొంగ

స్పైడర్ మ్యాన్ కాదు..  వింత దొంగ

చిమ్మచీకట్లో స్పైడర్ మ్యాన్ తరహా సాహసాలను చేస్తున్న ఇతగాడు .. జిమ్నాస్ట్ కాదు !! రాత్రి కాగానే ఇళ్లకు కన్నాలు వేసే దొంగ !! టార్గెట్ గా ఎంచుకున్న ఇంట్లోకి చొరబడేందుకు ఈ దొంగ స్పైడర్ మ్యాన్ లా విన్యాసాలు చేశాడు. తొలుత కారుపైకి ఎక్కి నిలబడి.. అక్కడున్న సన్నటి కేబుల్స్ పై మెల్లగా పాకుతూ ఇంటి పై అంతస్తులోకి కాలు మోపాడు. స్పైడర్ మ్యాన్ తరహా  భంగిమలతో అతగాడు ఇంటిపైకి ఎక్కిన దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ట్విటర్ లో వైరల్ గా మారింది.

ఈ దొంగతనం మే 31న  అర్ధరాత్రి 2 గంటల 17 నిమిషాలకు ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ఏరియాకు చెందిన సురేందర్ సింగ్ ఇంట్లో జరిగింది. దాదాపు అరగంటపాటు దొంగ ఇంట్లోనే అటూ ఇటూ తిరిగినట్లు సీసీ టీవీ ఫుటేజీని బట్టి స్పష్టమవుతోంది. ఇంట్లోని ఎనిమిది మంది గాఢ నిద్రలో ఉండటంతో.. ఆ సమయంలో దొంగ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. బీరువాను తెరిచి బంగారు గొలుసు, ఉంగురం, సెల్ ఫోన్ లను దొంగిలించాడు. అదే సమయంలో ఇంటి యజమాని సురేందర్ సింగ్ తల్లి నిద్రలేచి.. దొంగ అలికిడిని గుర్తించింది. ఆమె కేకలు వేయడంతో ఇంట్లోని మిగతా వాళ్లంతా నిద్రలేచారు. దీంతో దొంగ పలాయనం చిత్తగించాడు. స్పైడర్ మ్యాన్ భంగిమలతో.. ఎలా ఇంట్లోకి వచ్చాడో అలాగే అక్కడి నుంచి బయటపడ్డాడు. 

మరిన్ని వార్తలు..

నాదల్ పై సచిన్ ప్రశంసల జల్లు

గూగుల్ డూడుల్ గా ఐన్ స్టీన్ మెచ్చిన భారత శాస్త్రవేత్త