నాదల్ పై సచిన్ ప్రశంసల జల్లు

నాదల్ పై సచిన్  ప్రశంసల జల్లు

టెన్నిస్ ఛాంపియన్ రఫెల్ నాదల్ పై క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘నాదల్ చాలా చాలా స్పెషల్. వినమ్రత, ఇతరులపై గౌరవభావం కలగలిసి నాదల్ ను అందరి కంటే ప్రత్యేకంగా నిలుపుతాయి’’ అని పేర్కొంటూ సచిన్  ట్వీట్ చేశారు. దీనికి పెద్దఎత్తున లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చాయి. ఇంతగా నాదల్ ను సచిన్ మెచ్చుకోవడానికి కారణం.. జూన్ 3న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తో నాదల్ తలపడ్డారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో ఇద్దరూ నువ్వా ? నేనా ? అన్నట్టుగా ఇద్దరూ విజృంభించారు.

రెండో సెట్ జరుగుతుండగా..

మ్యాచ్ రెండో సెట్ జరుగుతుండగా అలెగ్జాండర్ జ్వెరెవ్ కుడికాలి మడమకు గాయమైంది. చివరకు మ్యాచ్ నాదల్ వశమైంది. దీనిపై ప్రకటన వెలువడిన అనంతరం నాదల్ స్వయంగా అలెగ్జాండర్ జ్వెరెవ్ దగ్గరికి వెళ్లి ఓదార్చారు. జ్వెరెవ్ ను కౌగిలించుకొని నాదల్ ధైర్యం చెప్పారు. జ్వెరెవ్ వయసు 25 ఏళ్లు కాగా.. నాదల్ వయసు 36 ఏళ్లు. ఇప్పటిదాకా 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను నాదల్ కైవసం చేసుకున్నారు. జ్వెరెవ్ పై నెగ్గడంతో ఆయన ఫైనల్ కు చేరారు. జూన్ 5 మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో నార్వే ఆటగాడు క్యాస్పర్ ర్యూడ్ తో తలపడనున్నారు. ఇందులోనూ నెగ్గితే 14వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నాదల్ ఖాతాలోకి చేరుతుంది. ఈసారి కూడా కప్పు నాదల్ కు చేజిక్కితే.. ఫ్రెంచ్ ఓపెన్ ను గెల్చుకున్న అతిపెద్ద వయస్కుడిగా కొత్త రికార్డు సృష్టించనున్నాడు. 

మరిన్ని వార్తలు..

బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా.. పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ

గూగుల్ డూడుల్ గా ఐన్ స్టీన్ మెచ్చిన భారత శాస్త్రవేత్త