డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌‌ కార్డులు ఇవ్వాలి :  కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్

డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌‌ కార్డులు ఇవ్వాలి :  కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్

కరీంనగర్ టౌన్,వెలుగు: జీవో 252 వెంటనే సవరించి డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కరీంనగర్ డెస్క్ జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ చేసింది. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి జిల్లా డెస్క్ జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గతంలో ప్రతి జిల్లాకు ఐదేసి కార్డుల చొప్పున ఇచ్చారని, ఈ లెక్కన కరీంనగర్ యూనిట్ పరిధిలో 43 కార్డులు అందాయని గుర్తు  చేశారు.  తాజా జీవో ప్రకారం కేవలం నాలుగు కార్డులు మాత్రమే వస్తాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామన్నారు.

ప్రభుత్వం పునరాలోచించి అర్హులందరికీ కార్డులు అందేలా చూడాలని కోరారు. అనంతరం గ్రీవెన్స్‌‌లో అడిషనల్‌‌ కలెక్టర్‌‌కు వినతిపత్రం అందజేశారు. టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, లీడర్లు  సీహెచ్ వేణుగోపాల్ రావు, జెరిపోతుల సంపత్, బి.వెంకటేశ్‌‌, ఫెడరేషన్ కార్యదర్శి బాపురావు తదితరులు సంఘీభావం ప్రకటించారు.  కార్యక్రమంలో డెస్క్ జర్నలిస్టుల అడ్‌‌హక్ కమిటీ కన్వీనర్ పోలు సంపత్, కోకన్వీనర్లు అల్లాడి శ్రీనివాస్, బాడిసె సంపత్‌‌కుమార్, రాజశేఖర్, శ్రీనివాస్, బాలకృష్ణ, జీవన్‌‌రెడ్డి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.