
హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ రూపొందించిన కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు అనుమతి పొందింది. దేశంలో ఈ తరహా అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్ గా కార్బెవాక్స్ ఘనత సాధించింది.
DCGI approves Corbevax as first heterologous COVID-19 booster shot for adults
— ANI Digital (@ani_digital) June 4, 2022
Read @ANI Story | https://t.co/p5zQYTwxwD#DCGI #Corbevax #COVID19 pic.twitter.com/BjvQtYEy7s
డీసీజీఐ నిర్ణయంపై బయోలాజికల్ ఇ ఎండీ మహిమ దాట్ల సంతోషం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కార్బెవాక్స్ ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చు. కార్బెవాక్స్ టీకాను ప్రస్తుతం 12 నుంచి 17 ఏళ్ల పిల్లలకు అందిస్తున్నారు. ఇప్పటికే కేంద్రానికి దాదాపు 10 కోట్ల డోసులను బయోలాజికల్ ఇ సరఫరా సంస్థ చేసింది. కొద్దిరోజుల క్రితం టీకా ధరను భారీగా తగ్గించింది. గతంలో డోసుకు రూ.840గా ఉండగా దీన్ని రూ.250 (పన్నులతో కలిపి)కి తగ్గించినట్లు గత నెలలో ప్రకటించింది.
మరిన్ని వార్తల కోసం..