వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు లేఖ.. హైదరాబాద్ లో జిహాదీ కుట్ర.!

వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు లేఖ.. హైదరాబాద్ లో జిహాదీ కుట్ర.!

వందేభారత్ రైళ్లు పేల్చేస్తామని రైల్వే అధికారులకు అగంతకుడు పంపినంచిన  లేఖ కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 3న అగంతకు  జీఎంకి పోస్టులో లేఖ పంపించాడు. అగంతకుడు  హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు జిహాది బృందం పథకం వేశారని లేఖలో తెలిపాడు .  వందేభారత్ వెళ్లే రైల్వే లైన్లలో బాంబులు పెట్టి 250 మందిని చంపేదుకు పథకం వేశారని బెదిరించాడు.  అంగతకుడు నలుగురు పేర్లను లేఖలో ప్రస్తావించాడు. 

దీంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు .. వందేభారత్ రైళ్లలో ప్రత్యేకంగా తనికీలు  చేశారు పోలీసులు.  లేఖ పంపించిన  ఆంగతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  లేఖను ఎవరైనా ఆకతాయిలు పంపించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఎవరైనా అనుమానితులు,వస్తువులు కనిపించినా 139 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.