పనిచేస్తున్న సైట్ లోనే కాపర్ వైర్స్ చోరీ..నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్

పనిచేస్తున్న సైట్ లోనే కాపర్ వైర్స్ చోరీ..నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ అరెస్ట్

కూకట్​పల్లి, వెలుగు: పని చేస్తున్న సైట్​లోనే కాపర్ చోరీ చేసి విక్రయిస్తున్న నలుగురు సెక్యూరిటీ గార్డ్స్​ను కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. కూకట్​పల్లి ఐడీఎల్ రోడ్డులోని మకుట తరంగ సైట్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సమీపంలోనే ఇదే సంస్థకు చెందిన మకుట త్రిపుర సైట్​లో కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మకుట తరంగలో తరచూ కాపర్ వైర్ చోరీకి గురవుతుండడంతో సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఈ ప్రాంతంపై నిఘా పెట్టిన పోలీసులు మకుట త్రిపుర సైట్​లోని సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లఖింద్ర బోరవు (26), అనుపమ్ గొగోయ్ (26), నీతు దాస్ (25), నట జ్యోతి దాస్ (25)ను అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన వీరందరూ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్​ గా పనిచేస్తున్నారు. పోలీసుల విచారణలో తామే కాపర్ వైర్ చోరీ చేశామని అంగీకరించారు. వీరి నుంచి దాదాపు రూ. 5 లక్షల విలువ చేసే కాపర్ వైర్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు.