గూగుల్ డూడుల్ గా ఐన్ స్టీన్ మెచ్చిన భారత శాస్త్రవేత్త

గూగుల్ డూడుల్ గా ఐన్ స్టీన్ మెచ్చిన భారత శాస్త్రవేత్త

‘గూగుల్ సెర్చ్ హోం పేజీ’పై ప్రదర్శితమయ్యే డూడుల్స్ కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. వాటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం చూస్తుంటారు. తాజాగా శనివారం (జూన్ 4న) గూగుల్ సెర్చ్ హోం పేజీపై భారతదేశ ముద్దుబిడ్డ , ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ‘సత్యేంద్ర నాథ్ బోస్’ డూడుల్ ను ప్రదర్శించారు. ఇది ఆయన జయంతి రోజో, వర్ధంతి రోజో కాదు !! ఒక ప్రత్యేకమైన రోజు !!

వందేళ్ల క్రితమే.. 

క్వాంటమ్ మెకానిక్స్ లో వందేళ్ల క్రితమే బోస్ ఒక గొప్ప థియరీని కనిపెట్టారు. 1924 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున (జూన్ 4న) దాన్ని ఐన్ స్టీన్ కు పంపించారు. దాన్ని చదివిన ఐన్ స్టీన్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ థియరీతో పూర్తిగా ఏకీభవించారు. భళా అని కొనియాడారు. అంతేకాదు.. ఐన్ స్టీనే స్వయంగా దాన్ని జర్మన్ భాషలోకి అనువదించి సత్యేంద్ర నాథ్ బోస్ పేరిట వ్యాసాన్ని ప్రచురించారు. ఈవిధంగా రూపు దిద్దుకున్న ‘ బోస్ - ఐన్ స్టీన్ స్టాటిస్టిక్స్’కు  క్వాంటమ్ ఫిజిక్స్ లో నేటికీ చాలా ప్రాముఖ్యత ఉంది. భౌతిక శాస్త్రంలో అరుదైన ఈ ఘట్టం చోటుచేసుకొని 98 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సత్యేంద్ర నాథ్ బోస్ ను గూగుల్ తన డూడుల్ ద్వారా స్మరించుకుంది. కాగా, సత్యేంద్ర నాథ్ బోస్ 1894 జనవరి 1న కోల్ కతా లో జన్మించారు. థియరీ ఆఫ్ రిలేటివిటీ పై ఆయన ముమ్మర పరిశోధనలు చేశారు. 

మరిన్ని వార్తలు.. 

సెస్ కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

83 ఏళ్ల వ‌య‌సులో ఒంటరిగా సముద్ర ప్రయాణం