కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం ఆరెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు భక్తులు చౌదరి లక్ష్మణ్, భీమన్ కార్ మంగాజి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పాదయాత్రగా బయలు దేరారు. వీరు ఏకంగా 850 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.తమ కష్టాలను తీరిస్తే తిరుమల ఏడుకొండలపైకి పాదయాత్రగా వస్తామని గతంలో మొక్కుకున్న వీరు.. కోరికలు నెరవేరడంతో మొక్కు చెల్లించేందుకు కొండకి నడిచి వెళ్తున్నారు. ఈనెల 20న ఊరిలోని పోచమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించుకుని, పాదయాత్రగా బయలుదేరారు. దాదాపు నెల రోజుల పాటు నడిచి వెళ్లనున్నారు.
