ఆ వ్యక్తి ఎంతటి అదృష్టవంతుడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..

ఆ వ్యక్తి ఎంతటి అదృష్టవంతుడో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..

ఏం చేసినా, ఏం జరిగినా మనిషికి ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. కానీ, ఈ వ్యక్తికి మాత్రం పనసకాయంత అదృష్టం ఉంది. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

ఈ వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు. సడెన్ గా ఉన్నట్టుటుండి రోడ్డు పక్కన ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే కొండచరియల మీద చెట్లు ఏపుగా.. ఒక లైనులో క్రమపద్ధతిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. సరిగ్గా ఆ వ్యక్తి అక్కడికి రాగానే.. కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలపై చివరి వరుసలో ఉన్న చెట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. దాంతో ఆ చెట్లు ఉన్నంతవరకు భూమి కిందికి జారింది. ఆ తర్వాత వరుసలో ఉన్న చెట్లు అన్నీ ఒకే లైనులో.. క్రమంగా ఒక దాని వెంట మరోకటి ఉండటంతో.. మట్టిని కిందికి జారకుండా అడ్డుకున్నాయి. దాంతో ఆ వ్యక్తి మట్టిపెళ్లలు మీద పడుతుండగా.. బైకును వదిలి దూరంగా వెళ్లిపోయాడు. క్షణాల్లో అతను అయితే తప్పించుకున్నాడు.. కానీ, బైకు మాత్రం మట్టిపెళ్లల కిందే ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. ఈ వీడియోను ఇదాని నందిని అనే మహిళ పోస్టు చేయగా.. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో రీపోస్టు చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా చెట్ల గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుతున్నారు.

For More News..

గుండెపోటుతో ఏపీ మాజీ ఎమ్మెల్యే మృతి

భార్య చనిపోయిన కాసేపటికే భర్త సూసైడ్

24 గంటల్లో 37,148 పాజిటివ్ కేసులు

టెస్టు చేయకుండానే కరోనా పాజిటివ్ గా తేల్చిన వైద్య సిబ్బంది!