ట్రంప్ , కిమ్ షేక్ హ్యాం డ్ వియత్నాంలో భేటీ అయిన నేతలు
నేడు మరోసారి సమావేశం
హనోయ్ : అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ , ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బుధవారం భేటీ అయ్యారు. వియత్నాం రాజధాని హనోయ్ లోని మెట్రోపోల్ హోటల్‌లో వీరు సమావేశమయ్యారు. గురు వారం కూడా వీరి మధ్య భేటీ జరగనుంది. ఇరు దేశాల జెండాల ఎదుట నిలబడి ఒకరికొకరు షేక్‌హడ్ ఇచ్చుకున్నారు. న్యూక్లి యర్ వెపన్స్‌ను వదిలేస్తే నార్త్ కొరియాకు మంచి భవిష్యత్తు ఉందని ట్రంప్ ఈ సందర్భంగా అన్నా రు. కిమ్ ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
అడ్డం కులను అధిగమిం చేందుకే తాము భేటీ అయ్యామని కిమ్ చెప్ పారు. దేశ ప్రజల ఆమోదంతో మెరుగ్గా పనిచేసేం దుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కిమ్ , ట్రంప్ మధ్య 20 నిమిషాల పాటు చర్చ జరిగినట్లు అధికారులు చెప్పారు. తర్వాత ట్రంప్ , కిమ్ ప్రత్యేక విందులో పాల్గొన్నారు. రెండు దేశాల నేతలకు స్వాగతం పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. రెండు రోజుల భేటీ కోసం ఇద్దరు నేతలు మంగళవారం సాయంత్రమే హనోయ్ కి చేరుకున్నారు. అణ్వాయుధాలను వదిలేస్తే ఉత్తర కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుందని, న్యూక్లియర్ వెపన్లను విడిచిపెడితే అభివృద్ధి ఆటోమేటిక్‌గా వస్తుందని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్, కిమ్ భేటీ అవ్వటం ఇది రెండో సారి.
Great meetings and dinner tonight in Vietnam with Kim Jong Un of North Korea. Very good dialogue. Resuming tomorrow!
— Donald J. Trump (@realDonaldTrump) February 27, 2019