అక్టోబర్ 4న అన్ స్టాపబుల్ 2 ట్రైలర్

అక్టోబర్ 4న అన్ స్టాపబుల్ 2 ట్రైలర్

అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే. ఓటీటీలో ఇదిచేసిన హంగామా అంతాఇంతా కాదు. ఇంతకుముందు టీవీలలో, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా వచ్చిన అన్ని ప్రొగ్రామ్స్ కంటే.. ఇదే హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్రొగ్రాం. సీజన్-1 ని విజయవంతంగా కంప్లీట్ చేసుకన్నా ఈ ప్రోగ్రాం.. సీజన్-2తో ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ స్టాపబుల్ సీజన్-2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 100శాతం లోకల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న ఆహా తెలుగు.. ఈసారి కూడా ఎవరూ చూడని విధంగా బాలయ్య బాబును అభిమానులకి చూపించబోతోంది. 

అక్టోబర్ 4న సీజన్ 2 ట్రైలర్

అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అంటూ ఆహా ద్వారా ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఐఏండిబిలో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ గా నిలబెట్టారు. మొదటి సీజన్ ను విజయంగా పూర్తి చేసిన ఆహా.. ఇప్పుడు సీజన్ 2తో రాడానికి రెడీ అవుతోంది. అందుకోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆహా జతకట్టింది. జాంబీ రెడ్డి, కల్కి లాంటి చిత్రాలతో తనకుంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిల్మ్ తో సినీ ప్రయాణం మొదలుపెడట్టాడు. అలా మొదలుపెట్టిన తన ప్రయాణం, దర్శకత్వం అన్ స్టాపబుల్ సీజన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా ప్రశాంత్ వర్మ చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణను చూపించబోతున్నారు. సీజన్ 2 ట్రైలర్ ను అక్టోబర్ 4న విజయవాడలో అభిమానుల ముందు ఆహా ప్రదర్శించబోతోంది.

బాలయ్యతో పని చేయడం అద్భుతం

సీజన్-1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణతో మరోసారి తప్పకుండా పనిచేయాలని చాలా గట్టిగా అనుకున్నానని.. అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చిందని ప్రశాంత్ వర్మ అన్నాడు. ఆహా టీమ్ సీజన్-2 కోసం స్టోరీ రాయాలి అనగానే.. తను వెంటనే ఒప్పుకున్నాను అని చెప్పాడు. బాలయ్యతో పని చేయడమంటేనే ఒక అద్భుతమని.. ఈ స్టోరీ అందరికి నచ్చే విధంగా తీర్చిదిద్దుతానని తెలిపాడు. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 4న మీరు చూసే ట్రైలర్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానని ప్రశాంత్ వర్మ అన్నాడు.