Vishwak Sen Gaami: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది..విశ్వక్ అందుకేనా మాట్లాడింది?

Vishwak Sen Gaami: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది..విశ్వక్ అందుకేనా మాట్లాడింది?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గామి(Gaami). కొత్త దర్శకుడు విశ్వధర్(Vishwadhar) తెరకెక్కించిన ఈ సినిమా శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

దాదాపు 6 సంవత్సరాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారంటే మాములు విషయం కాదు. ఇక ఈ సినిమాలో విశ్వక్ అఘోరాగా కనిపించడంతో యూత్ తో పాటు ఎన్నియో వర్గాల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. కానీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం రిచ్ అవ్వలేకపోతుంది.

గామి ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో మీడియా సమావేశంలో (మార్చి 13న) విశ్వక్ మాట్లాడారు.కొన్నాళ్లుగా ఎంతో కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చిన సినిమా గురుంచి..ఒక నలుగురు పెద్ద మనుషులు గామి చూసి మాట్లాడండి అని రిక్వెస్ట్ చేశారు. 

“అందరం కలిసి ఈజీగా ఒక కమర్షియల్ సినిమా తీయొచ్చు. కానీ, 6 ఏళ్లు కష్టపడి ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని తెలుగు తెర మీదికి ఒక కొత్త సినిమా రావాలి అని చెప్పి చేసిన ప్రయత్నమీ గామి. అయితే..మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు..కానీ, సినిమా గురించి తక్కువ చేసి మాత్రం వెనక్కి లాగకండి. ఇదంతా ఎవరు చేస్తున్నారో..ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు.ఇపుడు అది కూడా నేను పట్టించుకో దలచుకోలేదు..ఎందుకంటే నాకు అంత టైమ్ కూడా లేదు.

గాని మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని మాత్రమే గర్వంగా చెబుతాను. ఇకముందు నుంచి మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించే కథలతో వస్తాను. చూడని వాళ్ళుంటే వెంటనే చుడండి..మా సినిమాకి కూడా  నలుగురు పెద్ద మనుషులు చూసి..మాట్లాడితే బాగుంటుంది. గామి ఇక్కడితో ఆగిపోదు..ఇప్పుడే గామి మొదలయ్యింది. మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు.

నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడడం లేదు..సినిమా రిలీజ్ అయిన నాలుగురోజుల తరువాత మాట్లాడుతున్న మాటలు ఇవి. మీరు ఇక నేను ఏ విధంగా మాట్లాడుతున్నానో అర్ధం చేసుకోవొచ్చు. గామి అర్ధం కాలేదు అన్నవారిని తెలివి తక్కువ వారు అనలేం కానీ, ఇంకోసారి చూడండి.. ఖచ్చితంగా అర్ధమవుతుంది. విశ్వక్ మాట్లాడిన మాటలో సినిమా కోసం పడ్డ కష్టాన్ని చెబుతూ..రిలీజయ్యాక ఎలా ఆదరిస్తున్నారో అర్ధాన్ని వివరిస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విశ్వక్ అందుకేనా మాట్లాడింది? 

గామి సినిమా గురించి టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలు ఎవ్వరు ఎక్కువ స్పందించలేదు. మలయాళం నుంచి తెలుగులోకి వచ్చిన ప్రేమలు సినిమాపై మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, రాజమౌళి ఇలా చాలా మంది ప్రశంసలు కురిపించారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రేమలు చూసి సక్సెస్ మీట్‍కు హాజరై ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు.

తన కుమారుడు కార్తికేయ..ప్రేమలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో రాజమౌళి ఆ ఈవెంట్‍కు వెళ్లారు. అయితే రిలీజ్‍కు ముందు గామిపై పోస్ట్ చేసిన రాజమౌళి.. విడుదల తర్వాత మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అలాగే, టాలీవుడ్ టాప్ హీరోలు కూడా ఎవరూ ఈ చిత్రానికి మద్దతుగా పెద్దగా నిలిచినదాఖలు లేవు.

దీంతో ఇది మన తెలుగు సినిమా అని..నలుగురు పెద్దలు చూసి మాట్లాడాలంటూ విశ్వక్‍సేన్ రిక్వెస్ట్ చేసినట్టు అర్థమవుతోంది. ఓపిక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినపుడు దాన్ని..ఆదరించాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి ఇకనైనా ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.