Premalu OTT: OTTకి వస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Premalu OTT: OTTకి వస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళంలో సూపర్ హిట్టైన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ప్రేమలు(Premalu). కేవలం రూ.6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రేమలు సినిమా గురించే చర్చ నడిచింది. మలయాళంలో ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఇటీవలే ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు మేకర్స్. 

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మార్చ్ 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా రాబడుతోంది. ఒక సినిమా చూస్తూ ఈ రేంజ్లో  నవ్వి చాలా కాలమైంది అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ప్రేమలు సినిమా గురించి చెప్పడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

అయితే తాజాగా ప్రేమలు సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. తెలుగులో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుందట. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్ని ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మార్చ్ 29 నుండి ఈ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి థియేటర్స్ లో భారీ విజయాన్ని సాధించిన ప్రేమలు మూవీకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.