
కోలీవుడ్ స్టార్ ధనుష్(Danush) తమ కొడుకే అని కొంతకాలంగా కదిరేశన్(Kadireshan), మీనాక్షి(Meenakshi) జంట న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు మొదలయింది. దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ధనుష్ కు తాజాగా ఊరట లభించింది. హీరో ధనుష్ కదిరేశన్, మీనాక్షిల కొడుకు కాదని తేల్చి చెప్పేసింది కోర్ట్.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హీరో ధనుష్ తమ కొడుకు అని, సినిమాలపై ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయాడని, చాలా కాలంగా వెతుకుతుంటే.. ఇప్పుడు కనిపించాడని, తాము జీవించడానికి అతని నుండి నెలకు రూ 65 వేలు ఇప్పించాలని డిమాండ్ చేశారు కదిరేశన్, మీనాక్షి. అయితే.. హీరో ధనుష్ మాత్రం వాళ్ళు తమ అమ్మానాన్న కాదని, కస్తూరి రాజా, విజయలక్ష్మి తన తల్లితండ్రులని, కేవలం డబ్బు కోసమే తప్పుడు కేసు పెట్టారని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ కేసుపై విచారించిన కోర్ట్ ధనుష్ కదిరేశన్, మీనాక్షిల కొడుకు కాదని చెప్తూ కేసును కొట్టేసింది. కదిరేశన్, మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కాదని, వారు చెప్పినట్టుగా ధనుష్ ఒంటిపై ఎలాంటి పుట్టుమచ్చలు లేవని తెలిపింది.