Em Chestunnav OTT: ఓటీటీలోకి యూత్ ఫుల్ లవ్ స్టోరీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Em Chestunnav OTT: ఓటీటీలోకి యూత్ ఫుల్ లవ్ స్టోరీ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

డెబ్యూ డైరెక్టర్ భరత్‌ మిత్ర (Bharath Mithra) తెరకెక్కించిన మూవీ ఏం చేస్తున్నావ్‌ (Em Chesthunnav?).విజయ్‌ రాజ్‌ కుమార్‌ (Vijay Rajkumar) హీరోగా, నేహా పటాన్ (Neha Pathani),అమిత రంగనాథ్(Amitha Ranganath) హీరోయిన్స్గా నటించిన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో రిలీజై యావరేజ్ మౌత్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. 

ఈ సినిమాలో నటించింది ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు కావడం..అలాగే పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో వచ్చి పోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. దీనికి తోడు థియేటర్లో కూడా సరిగా ఆడకపోవడం వల్ల..హిట్ టాక్ అయితే తెచ్చుకోలేదు.

ఈ మేరకు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఏం చేస్తున్నావ్‌ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 28 నుంచి ఏం చేస్తున్నావ్ ను ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ అధికారికంగా పోస్ట్ చేసింది. మరి థియేటర్లో హిట్ అవ్వని..ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓటీటీలో ఎలా ఆకట్టుకుందో చూడాలి మరి. 

ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఆమని,C/o కంచరపాలెం రాజు.మధు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ఈ మూవీని ఎన్‌విఆర్ (NVR) క్రియేటివ్ వర్క్స్  బ్యానర్ పై కురువ నవీన్ (Kuruva Naveen) కురువ కిరణ్(Kuruva kiran) ఈ చిత్రాన్ని నిర్మించారు.