Inspector Rishi OTT: భయపెట్టేందుకు సిద్దమైన సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Inspector Rishi OTT: భయపెట్టేందుకు సిద్దమైన సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర(Naveen Chandra) హీరోగా వస్తున్న లేటెస్ట్ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి(Inspector Rishi). జేఎస్‌ దర్‌శకత్వం వహించిన ఈ సిరీస్ ను మేక్‌ బిలీవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై శుక్‌దేవ్‌ లహిరి నిర్మించారు. తమిళ భాషలో తెరకెక్కిన్న ఈ సిరీస్ లో సునయన, కన్న రవి, శ్రీకృష్ణ దయాల్‌,  మాలిని జీవర్తనం, కుమారవేల్‌ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్ కేసులు, ఇన్వెస్టిగేషన్, అతీత శక్తులు, దెయ్యాలు, వాటి మధ్య ఉన్న సంబంధాల కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కనుంది. 

దీంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ సిరీస్ మార్చ్ 29 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుంది ఈ సిరీస్. తాజాగా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి మంచి అంచనాల మధ్య వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి. 

ALSO READ :- కొత్తగా నియమించబడిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వీరే