కొత్త దర్శకుడు పృధ్వీ పేరిచెర్ల దర్శకత్వంలో, వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన "స్కై" చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒంటరితనం అనుభవించే ముగ్గురు వ్యక్తుల జీవితాల్లోని భావోద్వేగాలను ఈ సినిమా వెండితెరపై ఆవిష్కరించింది.
కథ
సింగర్‌గా ఎదగాలనే ఆశయంతో ఫ్యామిలీని అశ్రద్ధ చేసి, భార్యను, పదేళ్ల కొడుకును కోల్పోయిన ప్రభు (ఆనంద్) చుట్టూ కథ ప్రారంభమవుతుంది. మరోవైపు, ఉద్యోగ వేటలో ఉంటూ ప్రాంక్స్ చేసే విక్కీ (మురళీ కృష్ణంరాజు), అతని నిజాయితీకి ముగ్ధురాలైన వీణ (శృతి శెట్టి) పాత్రలు కథను ముందుకు నడిపిస్తాయి. ఒంటరితనంతో బాధపడుతున్న ఈ ముగ్గురి జీవితాలు ఎలా కలిశాయి? విక్కీ గతం ఏంటి? ప్రభు దుఃఖానికి శాంతి లభించిందా? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం.
విశ్లేషణ
మొదటి సినిమానే అయినా పృధ్వీ పేరిచెర్ల ఎమోషన్స్‌ను చాలా హృద్యంగా తెరకెక్కించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు ఏడు పాటలకు ఆయనే సాహిత్యం అందించడం విశేషం.పాత్రల పరిచయం, కామెడీ మరియు సెన్సిబుల్ సీన్స్‌తో సినిమా సరదాగా సాగిపోతుంది.ఈ సినిమాకు సెకండాఫే అసలైన ప్రాణం. ఎమోషనల్ డ్రామా, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
నటీనటుల ప్రతిభ
మురళీ కృష్ణంరాజు హీరోగా పరిచయమైన తొలి చిత్రంలోనే కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్‌లో మంచి ఈజ్ కనబరిచారు.ఆనంద్ చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో ప్రభుగా అద్భుతంగా నటించారు.వీణ పాత్రలో శృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది.
సాంకేతిక విభాగం
సీనియర్ కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్ సిటీ ఏరియల్ షాట్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.శివప్రసాద్ అందించిన మెలోడీ పాటలు హాయిగా ఉన్నాయి. ముఖ్యంగా "తపనే తెలుపగ" సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది.సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ కథకు బలాన్ని చేకూర్చింది.
ముగింపు
స్కై చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా. ఒంటరితనంలోని లోతును, జీవితం నేర్పే పాఠాలను చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
