చిన్న సినిమాలన్నీ బతుకు జట్కా బండ్లే.. మనుగడ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి

చిన్న సినిమాలన్నీ బతుకు జట్కా బండ్లే..  మనుగడ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి

పంజాగుట్ట, వెలుగు: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలన్నీ బతుకు జట్కా బండ్లేనని ఓ అందాల రాక్షసి చిత్ర హీరో షెరాజ్ మెహదీ అన్నారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించినప్పటికీ, చిత్ర పరిశ్రమలో సక్సెస్​ అవ్వాలంటే ఎన్నో అవరోధాలు దాటాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఓ అందాల రాక్షసి సినిమా విడుదలైనా నేటికీ థియేటర్లు లభించడం లేదని ఆరోపించారు. తన చిత్రానికి సెన్సార్ అనుమతి లభించినా కొందరు కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నారని అన్నారు. చిన్న సినిమాల మనుగడ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.