రాష్ట్ర పోలీసులకు పతకాల పంట

రాష్ట్ర పోలీసులకు పతకాల పంట
  •     ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీఎస్పీ నర్సయ్యకు ప్రెసిడెంట్‌‌‌‌ మెడల్‌‌‌‌ 
  •     3 శౌర్య పతకాలు,2 రాష్ట్రపతి విశిష్ట సేవా, 13 ఉత్తమ సేవా పతకాలు
  •     దేశవ్యాప్తంగా 1,057 పతకాలను ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే విశిష్ట సేవా పతకాల జాబితాలో తెలంగాణ పోలీస్‌‌‌‌, ఫైర్‌‌‌‌, హోమ్‌‌‌‌ గార్డ్‌‌‌‌ సిబ్బందికి ప్రత్యేక స్థానం దక్కింది. విధి నిర్వహణలో చూపించిన ధైర్యసాహసాలకుగాను ముగ్గురు జూనియర్‌‌‌‌ కమాండోలకు 3 శౌర్య  పతకాలు దక్కాయి. ఇంటెలిజెన్స్‌‌‌‌ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డికి, అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్యకు  ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్స్, 13 మందికి ప్రతిభా సేవా పతకాలు(పీఎస్‌‌‌‌ఎం) లభించాయి. కేంద్ర ప్రభుత్వం పోలీసు, ఫైర్‌‌‌‌, హోంగార్డ్ అండ్‌‌‌‌ సివిల్‌‌‌‌ డిఫెన్స్​, కరెక్షనల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ వంటి అన్ని విభాగాల్లో కలిపి 1,057 పతకాలను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర పోలీసులకు 272, ఫైర్‌‌‌‌ విభాగానికి 29 గ్యాలెంట్రీ మెడల్స్ లభించాయి. ఈక్రమంలోనే‍ పోలీసుశాఖకు 83 పీఎస్ఎం మెడల్స్, ఫైర్‌‌‌‌ విభాగానికి 4, హోంగార్డ్స్‌‌‌‌ విభాగానికి 3, కరెక్షనల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌కు 2 మెడల్స్‌‌‌‌ దక్కాయి. ఎంఎస్ఎం మెడల్స్​‍ పోలీసుశాఖకు 606, ఫైర్‌‌‌‌ విభాగానికి 28, హోంగార్డ్‌‌‌‌లకు 18, కరెక్షనల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌కు 12 దక్కాయి. శౌర్య, రాష్ట్రపతి, ప్రతిభా పతకాలకు ఎంపికైన 18 మందిని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌సహా పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.

ఎస్పీ జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి గతంలోనూ ఎన్నో అవార్డులు

రాష్ట్రపతి పోలీస్ మెడల్‌‌‌‌ రావడంపట్ల ఎస్పీ జగదీశ్వర్‌‌‌‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రేగట్టే గోపాల్‌‌‌‌ రెడ్డి కుమారుడైన జగదీశ్వర్‌‌‌‌ రెడ్డి హైదరాబాద్‌‌‌‌లోని ఇంటెలిజెన్స్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ విభాగంలో ఎస్పీగా ఉన్నారు. 2005లో కఠిన సేవా పతకం, 2009లో ఉత్తమ సేవా పతకం, 2011లో ముఖ్యమంత్రి శౌర్య పతకం, 2014లో ఆంతరిక్‌‌‌‌ సురక్ష పతకం, 2017లో ఇండియన్‌‌‌‌ పోలీస్ మెడల్‌‌‌‌, 2021లో మహోన్నత సేవా పతకాలను జగదీశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్వీకరించారు. 2006లో ఓ టెర్రరిస్ట్‌‌‌‌ను పట్టుకోవడంలో చూపిన ప్రతిభకుగాను సీబీఐ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. వీటితో పాటు ఆయన సర్వీసు రికార్డులో ఉత్తమ పనితీరుకు 85 కమెండేషన్‌‌‌‌ ఎంట్రీలు, 8 ప్రశంసా పత్రాలు, 2 ప్రత్యేక కమెండేషన్లు నమోదయ్యాయి. రాష్ట్రపతి పోలీస్ పతకానికి ఎంపికైన ఎస్పీ జగదీశ్వర్‌‌‌‌ రెడ్డిని ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌​‍ డీజీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు అభినందించారు.

విశిష్ట సేవా పతకాలకు  ఎంపికైన అధికారుల వివరాలు

1. శౌర్య పతకాలు 

బి. సత్యరావు (జూనియర్‌‌‌‌ కమాండో)  
కె. సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ (జూనియర్‌‌‌‌ కమాండో)
జె. వంశీ కృష్ణ (జూనియర్‌‌‌‌ కమాండో)

2. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు

ఆర్‌‌‌‌. జగదీశ్వర్‌‌‌‌ రెడ్డి (ఎస్పీ, ఇంటెలిజెన్స్‌‌‌‌)
నర్సయ్య జోగుల 
(అడిషనల్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌)

3. ఉత్తమ సేవా/ప్రతిభా పతకాలు (పోలీసు విభాగం)

పి. జగదీశ్వర్‌‌‌‌ (ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌)  
పి. వెంకటరమణ 
(అడిషనల్‌‌‌‌ డిప్యూటీ కమిషనర్‌‌‌‌)
భూమన రవికుమార్‌‌‌‌ రెడ్డి (డీఎస్పీ)
బచ్చలకూర రమేశ్‌‌‌‌ (డీఎస్పీ)
గంగారామ్‌‌‌‌ ఆశాల (ఏసీపీ)
ఆర్‌‌‌‌.జీ. శివ మారుతి(ఏసీపీ)
సి. రాములు (హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌)
డి. సత్యనారాయణ (అసిస్టెంట్‌‌‌‌ కమాండెంట్‌‌‌‌)
కె. తిరుపతి రాజు (హెడ్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌)
భూపతి శ్రీనివాసరావు (డీఎస్పీ)

అగ్నిమాపక శాఖ:

అశోక్‌‌‌‌ ముండే (లీడింగ్‌‌‌‌ ఫైర్‌‌‌‌ ఫైటర్‌‌‌‌)
నరసింహాచారి తిప్పర్తి (లీడింగ్‌‌‌‌ ఫైర్‌‌‌‌ ఫైటర్‌‌‌‌)
హోమ్‌‌‌‌ గార్డ్స్​‍అండ్‌‌‌‌ సివిల్‌‌‌‌ డిఫెన్స్
యాదయ్య మేడిపల్లి (హోంగార్డు)