హైదరాబాద్, వెలుగు: పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థులకు వయోపరిమితి పెంచడం హర్షణీయమని ఈబీసీ జేఏసీ జాతీయ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ నిరుద్యోగుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని 32 నుంచి 34 ఏళ్లకు, ఎస్సై పోస్టులకు 35 నుంచి 37 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వయోపరిమితి పెంపుతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పారు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల పోటీ పరీక్షల్లో ఎక్కువ మంది యువత పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఇదే విధంగా ఉద్యోగ పోటీ పరీక్షల దరఖాస్తు ఫీజులను కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని రవీందర్ రెడ్డి కోరారు.
