శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. రాజేష్ నిర్మిస్తున్నారు. మార్చి 6న సినిమా రిలీజ్ కానుంది. గురువారం టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పాడు. మరో అతిథి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘ఇలాంటి రూటెడ్ కథలు తగ్గుతున్న క్రమంలో ఈ సినిమా రావడం ఆనందంగా ఉంది. ఇందులో బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి’ అని చెప్పాడు.
హీరో శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ ‘నైజాంలో మైత్రి సంస్థ, ఆంధ్రాలో ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వారి నమ్మకం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకముంది’ అని చెప్పాడు. దర్శకనిర్మాతలు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారని ధీరజ్ మొగిలినేని అన్నారు. హీరోయిన్ గాయత్రి రమణ, డైరెక్టర్ బాల సతీష్, ప్రొడ్యూసర్ రాజేష్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
