
ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న అరుణ్ గోయల్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే అంతకు ముందే 65 ఏళ్లు పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు. సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎన్నికల కమిషనర్లుగా అధీర్ రంజన్ చౌదరి ప్రకటించారు. వీరిని అధికారికంగా రాష్ట్రపతి నియమించాల్సిఉంది.
మిగిలిన రెండు కమిషనర్ల పదవులు ఈరోజు (మార్చి 14) ఇద్దరు పేర్లను ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి అధికారిక ప్రకటన కాకముందుకే విడుదల చేశారు. ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను గురువారం కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ప్రకటించారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్యానెల్ పేర్లను నిర్ణయించారు. ఆరుగురిలో ఇద్దరి పేర్లను సెలక్షన్ పాన్యెల్ సెలక్ట్ చేసింది.
ALSO READ :- OTT platforms: షాకిచ్చిన కేంద్రం.. 18 OTT ప్లాట్‌ఫారమ్స్ బ్లాక్