డ్రోన్ కెమెరాకు చిక్కిన మాస్ కాపీయింగ్..పిల్లలు పరీక్ష రాస్తుంటే పేరెంట్స్ చిట్టీలు అందిస్తున్నరు

డ్రోన్ కెమెరాకు చిక్కిన మాస్ కాపీయింగ్..పిల్లలు పరీక్ష రాస్తుంటే పేరెంట్స్ చిట్టీలు అందిస్తున్నరు
  • మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన 

బీడ్: దేశంలో మాస్ కాపీయింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అయితే, విద్యార్థులకు పరీక్షల్లో స్వయంగా తల్లిదండ్రులు, బంధువులే స్లిప్ లు అందించడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా చౌసాలాలోని ఒక జూనియర్ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరిగింది. 

అందుకు సంబంధించిన దృశ్యాలు డ్రోన్ కెమెరాలో రికార్డ్‌‌ అయ్యాయి. మంగళవారం ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. కాలేజీ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు క్లాస్ రూమ్ కిటికీల నుంచి విద్యార్థులకు చిట్టీలు అందించారు. కాపీయింగ్ పై నిఘా కోసం  విద్యాశాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరా ఈ దృశ్యాలను షూట్ చేసింది. 

డ్రోన్ దగ్గరకు రావడం చూసి అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.