
అసభ్యకర కంటెంట్ ను టెలికాస్ట్ చేస్తున్న 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత కూడా అలాంటి కంటెంట్ నియంత్రించని 18 OTT, 19 వెబ్‌సైట్లు, 10 యాప్‌స్, 57 సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పలుమార్లు హెచ్చరికల తరువాత కూడా అశ్లీల కంటెంట్‌ని నియంత్రించకపోవడంతో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
బ్లాక్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లలో ప్రధానంగా మహిళల్ని కించపరిచే కంటెంట్, వివాహేతర సంబంధాలు, న్యూడిటీ, లైంగిక చర్యలు వంటి కంటెంట్ ప్రసారం చేస్తున్నట్లు తెలిపింది. ఆలాంటి కంటెంట్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆ కారణంగానే వాటిని బ్లాక్ చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇక బ్లాక్ చేసిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ లో.. Voovi, Yessma, Dream Feels, Tri Flicks, X Prime, Uncut Adda, Neon X VIP, Besharams, Hunters, Xtramood, Nuefliks, Rabbit, Mojflix, Hot Shots VIP, MoodX, Fugi, Chikooflix ఉన్నాయి.