Pakistan Cricket: ఏడాదికి 55 కోట్లా..! వాట్సన్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డు అప్పులు పాలు

Pakistan Cricket: ఏడాదికి 55 కోట్లా..! వాట్సన్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డు అప్పులు పాలు

జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024 కోసం విదేశీ కోచ్‌లు, సహాయక సిబ్బందిని నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చూస్తోన్న సంగతి తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్.. ఈ  ఏడాది పొట్టి ప్రపంచ‌క‌ప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకుగాను నికార్సైన కోచ్ కోసం వెతుకుతోంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండ‌ర్ షేన్ వాట్సన్‌..  కొత్త హెడ్‌కోచ్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీబీ అధికారులు అతనితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్  కోసం పాక్ క్రికెట్ బోర్డు ఎంత డబ్బు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం ఈ మాజీ ఆసీస్ ఆల్ రౌండర్ కోసం ఏకంగా ఏడాదికి పాకిస్థాన్ కరెన్సీలో 46 మిలియన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో చూసుకుంటే ఇది మొత్తం అక్షరాలా 55 కోట్ల రూపాయలను మాట. అంటే నెలకు 4.6 కోట్లు. ఇంత మొత్తంలో పీసీబీ డబ్బు ఆఫర్ చేయడం షాకింగ్ గా అనిపిస్తుంది. ఒకవేళ వాట్సన్ ఈ అంగీకారానికి ఒప్పుకుంటే పాక్ క్రికెట్ లో ఒక కోచ్ అందుకునే అత్యధిక శాలరీ ఇదే అవుతుంది. 

పాక్ క్రికెట్ బోర్డు ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లో స్టార్ ప్లేయర్ కు ఇచ్చే అత్యధిక మొత్తం రూ. కోటి 40 లక్షలు. అలాంటిది ఒక విదేశీ కోచ్ కోసం వాట్సన్ ఇంత భారీ మొత్తంలో బంపర్ ఆఫర్ ఇవ్వడం సాహసమనే చెప్పాలి. ఒకవేళ ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఓకే చెబితే పాక్ క్రికెట్ బోర్డు అప్పుల పాలవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఏడాదికి 55 కోట్లు ఆఫర్ చేసినా  వాట్సన్ తన నిర్ణయాన్ని ఇంకా తెలపలేదు. ఈ విషయంలో కాస్త సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. 

ప్రస్తుతం వాట్సన్ పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌(PSL)లో క్వెట్టా గ్లాడియేట్స్‌కు కోచ్‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు. దీంతో పీసీబీ ప్రయత్నాలు సఫలమయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ కు విదేశీ కోచ్‌గా చేసిన రిచర్డ్ పైబస్, మిక్కీ ఆర్థర్ వంటి వారు చాలా తక్కువగానే శాలరీ అందుకున్నారు. 

ALSO READ :- కాంగ్రెస్ లోకి జితేందర్ రెడ్డి? .. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ