ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం (ఫిబ్రవరి 24) సెక్రటేరియెట్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీ మొబైల్ ఆప్ ను ఆవిష్కరించారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ OPRS సేవలను కూడా అనుసంధానిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రయాణీకులు సుదూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందన్నారు.
యాప్ ద్వారా అందించే సేవలు :
మొత్తం OPRS సేవలు: 1,710, A/C సేవలు: 450, నాన్ -ఎ/సి సేవలు: 1,260, రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు 13,000 అని అధికారులు వెల్లడించారు. బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్. ఇక గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం ఈ యాప్ ద్వారా కల్పిస్తున్నారు. మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. TGSRTC బస్ పాస్ మాడ్యూల్ హైదరాబాద్ నగరంలోని ప్రయాణీకులకు మొబైల్ యాప్ ద్వారా నెలవారీ బస్ పాస్‌లను డిజిటల్‌గా తీసుకోవడానికి, పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుంది.
అందుబాటులో ఉన్న క్యాటగిరీలు, ఛార్జీలు:
1. సిటీ ఆర్డినరీ పాస్ నెలకు రూ.1,400
2. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ నెలకు రూ.1,600
3. మెట్రో డీలక్స్ పాస్ నెలకు 1,800
4. గ్రీన్ మెట్రో లగ్జరీ A/C నెలకు 2,200
5. పుష్పక్ A/C పాస్ నెలకు ₹5,000
T24 టికెట్:
గ్రేటర్ హైదరాబాద్ జోన్ (జంట నగరాలు) పరిధిలో కార్యకలాపాల కోసం T24 టికెట్‌ను MeTicket మొబైల్ యాప్‌లో విలీనం చెయ్యడం జరిగిందని ఈ సదర్భంగా అధికారులు తెలిపారు. T24 టికెట్ అనేది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్, ఇది యాక్టివేషన్ సమయం నుండి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో అన్ లిమిటెడ్ ప్రయాణ సదుపాయం కల్పిస్తుందని అన్నారు. రోజువారీ సగటు అమ్మకాలు: 16 వేల830 టిక్కెట్లు గా ఉంటాయన్నారు.
ఈ టికెట్ల చార్జీలు పెద్దలు-130, పిల్లలు - 90, మహిళలు (ఇతర రాష్ట్రాలు) / సీనియర్ సిటిజన్ - 110. T-24 టికెట్ పర్యాటకులకు, అప్పుడప్పుడు ప్రయాణించేవారికి, ఒకే రోజులో ఎక్కువ ట్రిప్పులు అవసరమయ్యే ప్రయాణీకులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
►ALSO READ | ఏటీఎంలో డబ్బులు నింపే వెహికల్తో డ్రైవర్ జంప్.. రూ.22 లక్షల డబ్బును జల్సాలకు ఖర్చు చేశాడు !
