Rinku Singh: తండ్రి హెల్త్ కండిషన్ సిరీయస్.. టీమిండియాను వీడిన రింకు సింగ్  

Rinku Singh: తండ్రి హెల్త్ కండిషన్ సిరీయస్.. టీమిండియాను వీడిన రింకు సింగ్  

Rinku Singh: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8లో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జింబాబ్వేతో భారత జట్టు తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్టు సమాచారం. స్టార్ బ్యాటర్ రింకు సింగ్ టీమ్ ని వీడిచి పెట్టి తన స్వగ్రామానికి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే తన కుటుంబ అత్యవసర కారణాల వలనే రింకు ఉన్నట్టుండి జట్టును వీడిన పెట్టినట్లు సమాచారం.  

లీగ్ దశలో వరుస విజయాలతో ముగించిన భారత్.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో నెట్ రన్‌రేట్ ఒక్కసారిగా -3.800కి పడిపోయింది. కాగా, సోమవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో భారత్ సెమీస్ ఆశలు క్లిష్టంగా మారిపోయాయి. 

►ALSO READ | ENG vs PAK: తడబడిన పాకిస్తాన్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే.. ?

జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో జరగనున్న తర్వాత రెండు మ్యాచుల్లో భారత్ భారీ తేడాతో గెలిస్తేనే.. సెమీ ఫైనల్ కి లైన్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం టీంకి ఆందోళన మారిన తరుణంలో.. తాజాగా, రింకు సింగ్ ఇలా ఉన్నట్టుండి జట్టును వదిలి పెట్టి పోవడంతో అభిమానులకు మరో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రింకు హాజరుకాలేదు. గురువారం నాటి మ్యాచ్‌కు ముందు మళ్లీ జట్టులో రింకు సింగ్ చేరుతాడా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.