అయ్యా ట్రంపు.. ఏంటి ఈ కంపు.. యుద్ధానికి వెళ్లిన సైనికులు టాయిలెట్స్ కోసం కొట్టుకోవడమేంటి..?

అయ్యా ట్రంపు.. ఏంటి ఈ కంపు.. యుద్ధానికి వెళ్లిన సైనికులు టాయిలెట్స్ కోసం కొట్టుకోవడమేంటి..?

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమైన అమెరికా.. మిడిల్ ఈస్ట్ లో వేల కొద్దీ సైనుకులను మోహరించింది. వందల కొద్దీ యుద్ధ విమానాలను, వార్  షిప్పులను దింపింది. ఇరాన్ అంతర్యుద్ధాన్ని ఆపటంతో పాటు.. అణ్వాయుధాల తయారీని అడ్డుకుంటామని చెప్పిన యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్.. ఆ దేశ చీఫ్ ఖమేనీ టార్గెట్ గా సైనిక దళాలను సిద్ధం చేశారు.  ఇంత భారీ ఆపరేషన్ కోసం వెళ్లిన వార్ షిప్పులలో సైనికులు టాయిలెట్స్ కోసం కొట్టుకోవడం.. ఇప్పుడు ప్రపంచం ముందు అమెరికా నవ్వుల పాలయ్యేలా చేసింది. 

ఇరాన్ పై యుద్ధం తప్పదని చెప్పిన అమెరికా.. 2026 ఫిబ్రవరి చివరలో మిడిల్ ఈస్ట్ లో సైనిక దళాలను భారీగా పెంచేసంది. 2003 ఇరాక్ పై దండయాత్ర తర్వాత.. మళ్లీ అంతటి యుద్ధ విమానాలను, నావికా దళాలను ఫిబ్రవరి 23–24 తేదీల మధ్య  ఇరాన్ చుట్టూ మోహరించింది యూఎస్. 

మిడిల్ ఈస్ట్ లో ఉన్న విమాన వాహక నౌకలలలో  USS జెరాల్డ్ ఆర్  ఫోర్డ్,USS అబ్రహం లింకన్ నౌకలు ముఖ్యమైనవి.  వీటితో పాటు120 కంటే ఎక్కువ యుద్ధ విమానాలు, అనేక డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు ఇతర వైమానిక రక్షణ ఆయుధ దళాలు కూడా ఉన్నాయి.  2017లో లక్షా 18 వేల కోట్ల రూపాయలతో (13 బిలియన్ డాలర్లు) ప్రారంభించిన USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ టాయిలెట్స్ డ్రైనేజీ సిస్టం ఫెయిల్యూర్ కు గురవ్వడం తీవ్ర  గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. మురుగు నీటి వ్యవస్థ వైఫల్యంతో.. యుద్ధం పక్కన పెట్టి సైనికుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. 

ఎందుకీ సమస్య..?

ఇన్ని కోట్ల రూపాయలతో తయారు చేసిన నావికా వాహనంలో  4 వేల600 నుంచి 5 వేల  మంది సిబ్బంది ఉన్నారు.  ఇంత మంది సైనిక సిబ్బందికి కేవలం 650 టాయిలెట్లు మాత్రమే ఉండటం షాకింగ్ విషయం.  అందులోనూ మురుగు నీటి వ్యవస్థ (సెవేజ్ సిస్టం) తరచుగా బ్రేక్‌డౌన్‌ కావటం, పొడవైన క్యూలు, టాయిలెట్స్ ఓవర్‌ఫ్లోలతో  ఓడలో పారిశుధ్య సంక్షోభం వచ్చినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. 

►ALSO READ | మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది:ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ

ఆమధ్య వెనుజులా ఆక్రమణ కోసం వెళ్లిన సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడిందట.  ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కూడా ఇదే పరిస్థితి ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇంత మందికి ఏ మాత్రం చాలని టాయిలెట్లు గంటల తరబడి లైన్లలో నిలుచోవడం.. సైనికులు కొట్టుకోవడం తరచూ జరుగుతందట. దీనికి తోడు లీక్‌లను సరిచేయడానికి ఇంజనీర్ల కొరత కూడా ఒక సమస్య. అరకొరగా ఉన్న ఇంజినీర్లే 19 గంటల షిఫ్టులలో పని చేస్తున్నారట. అయినా  వాక్యూమ్ టాయిలెట్ వ్యవస్థ  డిజైన్ లోపాలు, సముద్రంలో సెవేజ్ వ్యవస్థను నిర్వహించేందు సిబ్బంది లేకపోవటం.. సమయం సరిపోకపోవటం, కీలక ఆపరేషన్ల సమయంలో సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని తెలుస్తోంది. దీంతో యుద్ధం కోసం వెళ్లిన సైనికులు.. తమలో తామే యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రపంచ మీడియా సంస్థలు వెల్లడించాయి. 

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు:

అణు ఉత్పత్తిపై అమెరికాతో 10 నుండి 15 రోజుల్లోగా ఒప్పందం కుదుర్చుకోవాలని  ట్రంప్  ఇరాన్ ను ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. రాజీకి రాకపోతే అది వారి  దురదృష్టం అంటూ  హెచ్చరించారు.  బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో కూడా ట్రంప్.. హెచ్చరికల స్థాయిని పెంచారు.   ఇరాన్ ఒప్పందానికి రాకపోతే.. దారుణ పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు ట్రంప్. ఇక వేచి చూసే ధోరణికి స్వస్తి పలుకుతామని.. ఇరాన్ కు గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.