మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది:ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ

మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే ప్రారంభమైంది:ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలిదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. పుతిన్‌‌‌‌ను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచాలని కోరారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మంగళవారంతో నాలుగేండ్లు పూర్తవుతున్న తరుణంలో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 తూర్పు డోనెట్స్క్ ప్రాంతంలో 20% భూభాగాన్ని రష్యాకు అప్పగించాలన్న పుతిన్ డిమాండ్‌‌‌‌ను జెలెన్ స్కీ తోసిపుచ్చారు. ఇప్పుడు భూభాగాన్ని వదలుకున్నా పుతిన్ మళ్లీ దాడికి దిగుతారని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.