నాని ‘ది ప్యారడైజ్’ Aaya Sher ఫుల్ సాంగ్ రివ్యూ.. ఈ పాట జనాలకు ఎక్కుతుందో.. లేదో.. తేలిపోయింది !

నాని ‘ది ప్యారడైజ్’ Aaya Sher ఫుల్ సాంగ్ రివ్యూ.. ఈ పాట జనాలకు ఎక్కుతుందో.. లేదో.. తేలిపోయింది !

‘దసరా‘ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వస్తున్న రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఆయా షేర్’ ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్లో నాని హుక్ స్టెప్ హైలైట్గా నిలిచింది. ఒక ధగడ్ వచ్చి మొత్తం జాతిల జోష్ నింపినట్టు గానే.. ఈ ‘ఆయా షేర్’ సాంగ్ లిరిక్స్, అనిరుధ్ మ్యూజిక్, సాంగ్ కొరియోగ్రఫీ ఇంట్రస్టింగ్ గా అనిపించాయి. ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలను ఈ పాట మరింత పెంచిందనడంలో సందేహం లేదు.

నాని చేతి మీద ఉన్న పచ్చ బొట్టును ఈ పాటలో కూడా మరోసారి హైలైట్ చేశారు. నానిలో ఇన్నాళ్లు మంచి నటుడినే చూసిన ప్రేక్షకులు ఈ హుక్ స్టెప్ను చూసి షాకైపోయారు. ఈ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో దెబ్బకు వైరల్ అయింది. సరిగ్గా 11 నెలల క్రితం ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయింది. ఒక్క గ్లింప్స్తోనే టాక్ ఆఫ్​ది ఇండస్ట్రీగా ‘ది ప్యారడైజ్’ మారిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 21, 2026న నాని, శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.