యాదాద్రి, వెలుగు: తనపై దాడి చేసి కొట్టాడని మదర్ డెయిరీ డైరెక్టర్పై సస్పెండ్ అయిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పాల బిల్లుల విషయంలో అవినీతికి పాల్పడినట్టుగా ఫిర్యాదులు రావడంతో భువనగిరి మిల్క్ సెంటర్ మేనేజర్ పంచెద్దుల దశరథను సస్పెండ్ చేశారు. డైరెక్టర్ కస్తూరి పాండు సూచనలతోనే తాను బిల్లులను దారి మళ్లించినట్టుగా దశరథ ఒప్పుకున్నారు.
దీన్ని మనసులో పెట్టుకొని తనను కస్తూరి పాండు పిలిపించుకొని తన ఫోన్లోని డబ్బు లావాదేవీలకు సంబంధించిన డేటా తీసేయాలని ఒత్తిడి చేశాడన్నారు. తాను ఒప్పుకోకపోవడంతో దాడి చేసి కొట్టాడని దశరథ భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
